లారీ ఢీకొని బస్సు బోల్తా

11-11-2026 | 11:52am

రామచంద్రపురం: రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని భీరంగూడ కమాన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సల్మాన్ (30) తలకు తీవ్ర గాయాలయ్యాయి.


వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో బోల్తా పడిన బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు