గుడుంబా తయారీ కేంద్రాలపై Police Raid

06-11-2026 | 10:03am

ములుగు జిల్లాలో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న నిషేధిత గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఎస్సై తిరుపతిరావు ఆధ్వర్యంలో Police Team, CRPF బలగాలు సంయుక్తంగా ఈ Operation చేపట్టాయి. మండలంలోని సుడిబాక అటవీ ప్రాంతం, బెస్తగూడెం గ్రామ శివారులో ఈ Raids జరిగాయి. ఈ సందర్భంగా గుడుంబా తయారీ కేంద్రాలను పోలీసులు ధ్వంసం చేశారు. అక్కడ లభించిన 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోవడంతో పాటు, సుమారు 4,000 లీటర్ల జాగరీ వాష్‌ను ధ్వంసం చేశారు. ఈ అక్రమ తయారీ కార్యకలాపాలతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

గుడుంబా తయారీ, విక్రయాలు, సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను Confidential గా ఉంచుతామని స్పష్టం చేశారు. సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్: 8712670098. ఈ దాడుల్లో CRPF 39వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ప్రశస్త్, వెంకటాపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది, 39వ బెటాలియన్ CRPF బలగాలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు