విద్యార్థుల ప్రాణాలకు భరోసా ఏది?
విద్యార్థుల జీవితాలకు బంగారు బాటలు వేయాల్సిన ఇంజనీరింగ్ కళాశాలలు నేడు విద్యాబోధనకు మించి ఆర్భాటపు వేడుకలకు ప్రాధాన్యత ఇస్తున్నాయనే విమర్శలు ఆందోళన కలిగిస్తున్నాయి. విజ్ఞానాన్ని అం దించాల్సిన తరగతి గదులు, పరిశోధనలకు వేదిక కావాల్సిన ప్రయోగశాలలు, భవిష్యత్తు ఇంజనీర్లను తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలు సినిమా ప్రచా ర కార్యక్రమాలు,
సాంస్కృతిక ఉత్సవాలు, డీజే ప్రదర్శనలు, అర్ధరాత్రి వేడుకలకు కేంద్రాలుగా మారుతున్నాయనే ఆరోపణలు విద్యావ్యవస్థలోని ప్రాధాన్యతలను ప్రశ్నిస్తున్నాయి. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి సాంస్కృతిక కార్యక్రమాలు అవసరమే. కానీ వాటి నిర్వహణలో విద్యా విలువలు, క్రమశిక్షణ, భద్రత వెనుకబడితే మాత్రం అలాంటి కార్యక్ర మాల ఉద్దేశమే ప్రశ్నార్థకమవుతుం ది.
తల్లిదండ్రులు తమ జీవితాలను ధారపోసి, రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్మును పిల్ల ల చదువుల కోసం ఖర్చు చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆశలు, విద్యా ర్థుల భవిష్యత్తు, సమాజపు ఆకాంక్షలు ముడిపడి ఉన్న విద్యాసంస్థలు ఆ బాధ్యతను గుర్తించాలి.
విద్యార్థులను కేవలం ఫీజులు చెల్లించే వినియోగదారులుగా కాకుండా, దేశ భవిష్యత్తును నిర్మించే పౌరులుగా చూడాలి. అలాంటి బాధ్యతాయుతమైన ప్రాంగణాల్లోనే వారి భద్రతకు ముప్పు ఏర్పడితే, తల్లిదండ్రులు తమ పిల్లలను కళాశాలలకు పంపించేటప్పుడు కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది.
ఇటీవల కొన్ని విద్యాసంస్థల్లో సినీ తారల సందర్శనలు, సినిమా ప్రమోషన్లు, భారీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఒక ఆకర్ష ణీయమైన ప్రచార పద్ధతిగా మారుతోంది. విద్యార్థుల్లో సినీ ప్రముఖుల పట్ల ఉండే ఆసక్తిని ఉపయోగించుకుని పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించడం ద్వారా సంస్థలకు ప్రచారం లభించవచ్చు. అయితే ఆ ప్రచారానికి చెల్లించాల్సిన మూల్యం విద్యార్థుల భద్రత కావడం అత్యంత ప్రమాదకరం.
మల్లారెడ్డి విద్యాసంస్థలో యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమాకు సంబంధించిన కార్యక్రమం, సంబంధించిన సినిమా కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై వెలువడిన ఆందోళనలు విద్యాసంస్థల్లో భారీ ఈవెంట్ల నిర్వహణ తీరును పునఃపరిశీలించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. ముఖ్యంగా ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో చోటుచేసు కున్న ఘటనలో విద్యార్థులు
ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరం. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాల్సిన వయసులో ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబాలకు తీరని లోటు. ఒక కుటుంబం ఎన్నో ఆశలతో పెంచుకున్న బిడ్డ తిరిగి ఇంటికి రాకపోవడం మాటల్లో వర్ణించలేని విషాదం. విద్యార్థుల మరణాల వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటి?
భద్రతా ఏర్పాట్లలో ఎక్కడ వైఫల్యం జరిగింది? ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారా? బాధ్యత వహించాల్సిన యాజమాన్యం, నిర్వాహ కులు, సంబంధిత అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిం చా రా? అనే ప్రశ్నలకు నిష్పక్షపాత విచారణ ద్వారా సమాధానాలు లభించాలి. ప్రాణనష్టం జరిగిన ప్రతిసారీ విచారం వ్యక్తం చేయడం, పరామ ర్శలు నిర్వహించడం,
పరిహారం ప్రకటించడం మాత్రమే సరిపోదు. ప్రమాదానికి దారితీసిన కారణాలను గుర్తించి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నప్పుడే బాధిత కుటుంబాలకు న్యాయం జరిగినట్లు అవుతుంది. ఇక్కడ ప్రభుత్వ బాధ్యత అత్యం త కీలకం. విద్యాసంస్థలకు అనుమతులు ఇవ్వడం, వాటి పనితీరును పర్యవేక్షించడం, విద్యార్థుల హక్కులను పరిరక్షించడం ప్ర భుత్వ యంత్రాంగం విధుల్లో భాగం. ఉన్నత విద్యాశాఖ, పోలీసు శాఖ, అగ్నిమాపక విభాగం, స్థానిక పరిపాలనా యంత్రాంగం పరస్పర సమన్వయంతో పనిచేయాలి.