రూ.3.83 లక్షల కోట్లు టోకరా!

09-10-2026 | 05:05am

దేశవ్యాప్తంగా ట్రాఫిక్ చలానాల బకాయిలు(Outstanding traffic challans) భారీగా పేరుకుపోయాయి. మొత్తం రూ.45 వేల కోట్ల మేర చలానాలు పెండింగ్‌లో ఉండగా, ఇందు లో దాదాపు రూ.20 వేల కోట్ల చలానాలను వాహనదారులు చెల్లించకుండా త ప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ బకాయిలను వసూలు చేసేందుకు సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. చలానాలను విద్యుత్ బిల్లులకు జత చేసి వసూలు చే యాలని, ఆ మొత్తాన్ని చెల్లించకపోతే వి ద్యుత్ కనెక్షన్ తొలగించే అవకాశం ఉంటుందనే భయంతోనైనా బకాయిలు చెల్లిస్తారని పేర్కొంది. అయితే, ఒక తప్పుకు మరో రకమైన శిక్ష వేసేలా ఉన్న ఈ తీర్పు ఎంతవరకు న్యాయసమ్మతం? అనే ప్రశ్నలు పలు వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.

ఇదే సమయంలో ప్రభుత్వాల ద్వంద్వ విధానాలపై కూడా విమర్శలు వస్తున్నాయి. నిబంధనలను పక్కనబెట్టి కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఇచ్చి, ఆ తర్వాత వాటిని రద్దు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలతో పోల్చితే.. ఈ ట్రాఫిక్ చలాన్ల మొత్తం చాలా స్వల్పమేనని చెప్పాలి. ఇటీవల పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. దాదాపు 3.83 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను రద్దు చేస్తూ, సదరు ఖాతాదారులను మొండి బకాయిదారులుగా ప్రకటించడం జరిగింది.  

లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన మొండి బకాయిదారులపై కఠిన చర్యలు తీసుకోకుండా, వారి అప్పులను రద్దు చేయడం ముమ్మాటికీ బ్యాంకింగ్ రంగాన్ని నిర్లక్ష్యం చేయడమే. మరోవైపు సుమారు 20 వేల కోట్ల రూపాయల ట్రాఫిక్ చలాన్లు చెల్లించని వారి ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయవచ్చని సర్వోన్నత న్యాయస్థానం  తీర్పు వెలువరించటం హర్షణీయమే అయినప్పటికీ.. ‘మోకాలికి బోడిగుండు’కు ముడిపెట్టిన చందంగా ఉంది.

ఈ తరహా కఠిన నిర్ణయాలు సామాన్యుల మానవ హక్కులను హరించడమేనని ప్రజాసంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఇలాంటి కఠిన నిర్ణయం రుణ ఎగవేతదారులపై తీసుకుని ఉంటే, దేశంలోని బ్యాంకుల పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉండేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్యాం కుల నుంచి లక్షల కోట్లు ఎగవేసిన బడా బాబుల పట్ల కూడా సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) కనీసం సుమోటోగా (స్వచ్ఛందంగా) వ్యాజ్యం నమోదు చేసి, రికవరీ తీర్పులు చెబితే బాగుంటుందని పలువురు కోరుతున్నారు.

దీనివల్ల బ్యాం కుల్లోని ప్రజాసొమ్మును కాపాడగలిగే వెసులుబాటు కలుగుతుంది.  రుణ ఎగవేతదారుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎందుకు శీతకన్ను వేసిందో, కొందరు ఎగవేతదారులు దేశం విడిచి పారిపోతుంటే ఏమి ఆశించి చూసీచూడనట్లు వ్యవహరించిందో ఆ దేవునికే తెలియాలి. ఈ విష యంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదే అంశాన్ని ఎంతోకాలంగా ప్రతిపక్షాలు సైతం విమర్శిస్తూనే ఉన్నాయి. 

భారతదేశంలో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కావాలనే తిరిగి చెల్లించని ‘విల్‌ఫుల్ డిఫాల్టర్లు’(కలిగి ఉండి కూడా ఎగవేసేవారు) బకాయి పడ్డ మొత్తం రూ.3.83 లక్షల కోట్లకు చేరిందని ఇటీవల లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తం 2026- 2027 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలో ఎక్స్‌ప్రెస్ రహదారులు, గ్రీన్‌ఫీల్డ్ కారిడార్లు, జాతీయ రహదారుల నిర్మాణం మరియు రోడ్ల విస్తరణ తదితర అవసరాలకు జాతీ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖకు కేటాయించిన మొత్తం బడ్జెట్ (సుమారు రూ. 3.10 లక్షల కోట్లు) కంటే ఇది మరో రూ. 73 వేల కోట్లు ఎక్కువ.

అయితే కేంద్రం ప్రకటించిన అధికారిక గణాంకాల్లో కొందరు ప్రముఖ ఎగవేతదారుల పేర్లు లేకపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన వివరాల ప్రకారం ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేసిన వారి సంఖ్య 18,318కి పెరిగింది. వీరు బ్యాంకులకు ఎగ్గొట్టిన మొత్తం బకాయిల విలువ రూ.3,83,264 కోట్లుగా నమోదైంది. 

ప్రభుత్వ రంగ బ్యాంకుల డేటా ప్రకారం చూస్తే, 25 లక్షలు రూపాయలు అంతకంటే ఎక్కువ రుణం తీసుకుని ఎగవేసిన 15,930 మంది డిఫాల్టర్లగా పేర్కొనటం జరిగింది.  వారి వద్ద  2.85 లక్షల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్లను క్లియర్ చేసుకోవడానికి గడిచిన 11 ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు రూ. 9.75 లక్షల కోట్ల నిరర్థక ఆస్తులను రికార్డుల నుంచి తొలగించి వారి బకాయిలను రైట్ ఆఫ్(రద్దు )చేశాయి.

అయితే కంటితుడుపుగా చేసే ప్రకటనలు మాత్రం.. రైటాఫ్ చేసినా సరే బ్యాంకులు వీరి నుంచి వసూలు ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంటాయని చెప్పటాన్ని ప్రజలు, ఆర్ధిక రంగ నిపుణులు అసలు నమ్మే అవకాశాలు లేవు. దేశంలో పెండింగ్ కేసులు 1 కోటి రూపాయలు కంటే ఎక్కువ రుణం ఉండి, కోర్టుల్లో చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటున్న పెద్ద ఎగవేతదారుల నుంచి బ్యాంకులు వసూలు చేయాల్సిన మొత్తం దేశవ్యాప్తంగా సుమారు రూ.29 లక్షల కోట్ల వరకు ఉందని నివేదికలు చెబుతున్నాయి. బాంకుల్లోఉన్నది ప్రజల సొమ్మే.. అది ఎప్పటికీ వసూలు అవుతుందో దేవునికెరుక అని ప్రజలు పెదవి విరుస్తున్నారు .

‘విల్‌ఫుల్ డిఫాల్టర్స్’ జాబితాలో ప్రముఖులు

దేశంలోని బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని, చెల్లించకుండా ఎగవేసిన వారిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇతర బ్యాంకులు  వారిని ‘విల్‌ఫుల్ డిఫాల్టర్స్’ గా ప్రకటించాయి. ఆర్బీఐ మరియు క్రెడిట్ సమాచార సంస్థల గణాంకాల ప్రకారం దేశంలో అత్యధికంగా రుణాలు ఎగవేసిన ప్రముఖ కంపెనీలు మరియు వ్యక్తుల జాబితాలో ప్రదానంగా గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ / మెహుల్ చొక్సి ఎగవేసిన సుమారు మొత్తం: రూ.7,600 కోట్లకు పైమాటే.

వడ్డీ వ్యాపారి నీరవ్ మోదీతో కలిసి పీఎన్‌బీ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మెహుల్ చొక్సికి చెందిన ఈ సంస్థ దేశంలోనే అత్యధికంగా బ్యాంకు రుణాలు ఎగవేసిన జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఎగవేసిన సుమారు మొత్తం రూ.6,900 కోట్లకు పైగానే వుండగా.. గుజరాత్‌కు చెందిన ఈ నౌకల నిర్మాణ సంస్థ ఎస్‌బీఐ సహా పలు కన్సార్టియం బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసింది. దీన్ని దేశ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకింగ్ మోసాలలో ఒకటిగా పరిగణిస్తారు.

ఇక భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ ఎగవేసిన సుమారు మొత్తం: రూ. 4,700 కోట్లకు పైగాఎగావేయ్యగా స్టీల్ రంగానికి చెందిన ఈ కంపెనీ బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించకపోవడంతో విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ప్రకటించబడింది. ఆర్కాన్ గ్రూప్ / వాధ్వాన్ గ్రూప్  ఎగవేసిన సుమారు మొత్తం: రూ.4,700 కోట్లకు పైగా (రాకేష్ కుమార్ వాధ్వాన్, కపిల్ వాధ్వాన్ తదితరులు)డీహెచ్‌ఎఫ్‌ఎల్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్) మరియు హౌసింగ్ ఫైనాన్స్ రంగానికి చెందిన ప్రమోటర్లు బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొని ఎగవేసినట్లు ప్రకటించింది. ఇంకా కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ఎగవేసిన సుమారు మొత్తం రూ.4,400 కోట్లకు పైగానే వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలను ఎగవేయడంతో ఈ కంపెనీ పేరు కూడా ఎగవేతదారుల జాబితాలో ప్రముఖంగా ఉంది.

అలాగే రోటోమ్యాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సుమారు రూ.2,500 కోట్లు, జూమ్ డెవలపర్స్ సుమారు రూ.2,500 కోట్లు, శక్తి భోగ్ ఫూడ్స్ లిమిటెడ్ - సుమారు రూ.2,400 కోట్లు, విన్‌సమ్ డైమండ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగవేసిన మొత్తం  సుమారు రూ.2,300 కోట్లు, ఇంకా పలువురు ప్రముఖ ఎగవేతదారులు ఉన్నప్పటికీ వారిని జాబితాలో పేర్కొనబడక పోవటం గమనార్హం. బ్యాంకుల వారీగా చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇలాంటి విల్‌ఫుల్ డిఫాల్టర్ల బకాయిలు అత్యధికంగా ఉన్నాయనేది రిజర్వ్ బ్యాంకు అధికారికంగా ప్రకటించింది.

ఒక సామాన్య రైతు  లేదా చిరు వ్యాపారి చిన్నపాటి రుణం పొందాలంటే సవా లక్ష నిబంధనలు, రుణానికి సరిపడా రెండు మూడొంతుల ఆస్తులు, అవి చాలవన్నట్లు హామీలు ఉంటే గాని రుణం ఇవ్వని బాంకులు.. ఎగవేతదారులకు ఇంత పెద్దమొత్తంలో ఏమి ఆశించి ఇచ్చినట్లు. ఇవే నిబంధనలు ఎగరవేతదారులకు వర్తింపజేసి ఉంటే ఖాతాదార్లకు అధిక వడ్డీలు, ప్రత్యేక పథకాలు ఇచ్చేందుకు, దేశం మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుండేది. మరో వైపు దేశంలో చాలా మంది ఉచితాలకు అలవాటు పడ్డారు.

దివ్యాంగులు, ఏ ఆధారం లేని వృద్ధులు, వితంతువులు, అన్ని అర్హతలున్న వారికి పథకాలు అందితే మంచిదే. కానీ కొందరు ఏ అర్హత లేకపోయినా దొడ్డిదారిన పథకాలు పొందుతూ, ఏ పని చేయకుండా బానిసలుగా మారుతున్నారు.  కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని నయానో భయానో ఎగవేతదారుల నుంచి రూ.3.83 లక్షల కోట్లు వసూలు చేయాలని, అర్హులకే సంక్షేమ పథకాలు అందేలా చూడాలని.. లేకపోతే మరో వంద ఏళ్ల వరకు కూడా భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోతుందనేది చెప్పక తప్పదు.

సీనియర్ జర్నలిస్ట్, 9491545699

చలాది పూర్ణచంద్రరావు

మరిన్ని వార్తలు