ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక సవాల్!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అధికారంలోకి రావడానికి నిరుద్యోగ యువత ఆకాంక్షలు, ఉద్యోగ నియా మకాల హామీ ముఖ్యమైన అంశాలుగా నిలిచాయి. ఎన్నికల సందర్భంగా ఐదేళ్లలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చే స్తామని ఇచ్చిన హామీపై యువతలో భారీ ఆశలు ఏర్పడ్డాయి.
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లినా, రెండు లక్షల ఉద్యోగాల హామీ ఎంతవరకు అమలైంది? ఇంకా ఎన్ని ఖాళీలు భర్తీ కావాలి? అనే ప్రశ్నలకు స్పష్టమైన, తాజా గణాంకాలతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం, 2026 సెప్టెంబరులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ ని యామకాలు పూర్తిచేసినట్లు వెల్లడించారు. అయితే, ప్రభుత్వం ప్రకటించిన నియామకాల సంఖ్యకు, కాంగ్రెస్ హామీ ఇచ్చిన రెం డు లక్షల ఉద్యోగాలకు మధ్య ఉన్న తేడాపై విపక్షాలు గగ్గోలుపెడుతున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ల కోసం ఎదురుచూపులు.. పరీక్షల నిర్వహణలో జాప్యాలు.. ప్రశ్నపత్రాల లీకేజీ వివాదాలు.. ఉద్యోగాల కోసం రోడ్లపైకి వచ్చిన నిరుద్యోగులు ఇవన్నీ ప్రతికూలంగా మారి ఓటమికి దారి చూపాయి, ఎన్నికల సమయంలో ప్రధాన సమస్యలుగా నిలిచాయి.
ముఖ్యంగా 2022లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షతోపాటు మరికొన్ని నియామక పరీక్షలు ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో రద్దు కావడం, వాయిదా ప డడం వేలాది మంది అభ్యర్థుల్లో ఆందోళన కలిగించింది. తల్లి, తండ్రులకు చిర్రెత్తిం చింది. కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టింది.
ఈ నేపథ్యంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, నియామకాల పారదర్శకత ప్రధాన చర్చనీయాంశా లయ్యాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగాం ఎమ్మెల్యేగా గెలువడంతో ఖాళీ అయిన నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నికలో కాంగ్రె స్ అభ్యర్థిగా చింతపండు నవీన్ బరిలో నిలిచి గెలుపొందారు.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గంలో మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుం డగా, 52మంది అభ్యర్థులు పోటీ చేసారు. ఇందులో 3,28,445మంది ఓటు వేశారు. మొత్తం పోలింగ్ సుమారు 68.65 శాతం నమోదయ్యింది. మొదటి, రెండవ ప్రాధాన్యత, గెలుపునకు అవసరమైన ఓట్లు రాక పోవడంతో తక్కువ ఓట్లొచ్చిన 48మందిని ఎలిమినేట్ చేసి, 49వ రౌండ్లో ఆశోక్ ఎలిమినేట్ అయ్యేవరకు 30,461 ఓట్లు , 50వ రౌండ్ లో ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ అయ్యేవరకు 48,874 ఓట్ల కు చేరుకున్నారు.
రెండవ ప్రాధాన్యత లెక్కించగా కాంగ్రెస్ అభ్యర్థి 1,50,524, బీఆర్ఎస్ అభ్యర్థి 1,35,802 ఓట్లు సాధించారు. గెలుపు కోటాకు 4,571ఓట్లు తక్కు వగా ఉన్నప్పటి కీ 14,722 ఓట్లు అధికంగా ఉన్న చింతపం డు నవీన్ (తీన్మార్) గెలిచినట్లు ప్రకటించారు. ఇదే నియోజకవర్గం లో 2021 పట్టభద్రుల ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్రెడ్డి 12,806 ఓట్లతో గెలిచారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5,31,268 నమో దు చేసుకున్నారు. 93మంది పోటీ చేయ గా, 67.26శాతం పోలింగ్ నమోదైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్రావు పై బీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి 30,100 మెజార్టీ సాధించారు. మార్చిలో జరిగే పట్టభద్రుల నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలు బలబలాలు చూపెట్టుకునేం దుకు ప్రయత్నం చేసినా అధికార పార్టీ ఎలాగైనా రెండు స్థానాల్లో తప్పనిసరిగా గెలవాలనే దూకుడు పెంచింది. ఎమ్మెల్యేలు, మంత్రులను ఇప్పటికే ఇంచార్జులుగా నియమించింది.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపు భుజాన వేసుకొని మంత్రుల పదవులకు ఎసరు వస్తుందేమోనన్న భయం వెంటాడుతున్నది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కు నిజమైన న్యాయం జరగాలంటే ఉద్యోగ నియామకాలు రాజకీయ హామీలుగా కాకుండా ప్రభుత్వ బాధ్యతగా మారాలి.
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరి లో నిలిచేందుకు జనసేన అభ్యర్థిని ప్రకటించింది. తెలంగాణ రక్షణ సేన సామా జిక న్యాయం పేరుతో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపింది. సీపీఐ, సీపీఎం పార్టీలు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తాయనే గుసగుసలు వినబడుతున్నాయి. మొన్న జరి గిన ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో మిత్రపక్షానికి కాంగ్రెస్ మద్దతివ్వకుండా ఒంట రిగా పోటీచేసి చతికలపడింది.
టీజేఎస్ అధినేత కోదండరాం పోటీ చేయకుండా మిత్రపక్షమైన కాంగ్రెస్కు మద్దతు ఇస్తుందనే భావన ఉంది. గతంలో టీచర్స్ నియో జకవర్గంలో ఒంటరిగా పోటీ చేసి తప్పిదం చేసిందనే ఆలోచన పార్టీలో నెలకొంది. బీజేపీ నుండి పోటీ చేయడానికి జంకుతున్నారని, గతంలో ఓడిపోయిన రాంచందర్ రావు పోటీ చేస్తారని, ఓడిపోతే ఉన్న అధ్యక్షపదవికి ముప్పు వస్తుందని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.తీన్మార్ మల్లన్న తనే పోటీ చేస్తారా?
ఎవరినైనా బరిలోకి దింపుతారా? అనే ప్రశ్న ఎదురవు తోంది. నిత్యం దొరలను, రెడ్లను తిట్టే మల్లన్న బరిలో నిలవకపోతే బీసీల నుండి తీవ్ర విమర్శ ఎదుర్కొనక తప్పదు. నాయకత్వానికి సన్నిహితంగా ఉండటం కంటే పట్టభద్రుల మధ్య విశ్వసనీయత కలిగిన వ్యక్తులను ఎంపిక చేయడం ముఖ్యం. అభ్యర్థులు తమ ఎన్నికల ప్రణాళికను లిఖితపూర్వకంగా ప్రకటించి, గెలిచిన తర్వాత అమలు పురోగతిపై పట్టభద్రులకు నివేదిక ఇచ్చే సంప్రదాయాన్ని నెలకొల్పాలి.
ప్రస్తు తం తెలంగాణలో 2027 మార్చిలో రెండు పట్టభద్రుల ఎన్నికలు జరగనున్న నేపథ్యం లో ఓటరు జాబితా తయారీ కీలక దశలో ఉంది. అర్హులైన పట్టభద్రులు ఓటు నమోదుపై నిర్లక్ష్యం చేయకూడదు. అర్హతలు, దరఖాస్తు గడువు, అవసరమైన ధ్రువపత్రాలను అధికారిక సమాచారంతో నిర్ధా రించుకోవాలి. ముఖ్యంగా గతంలో ఓటరుగా నమోదై ఉన్నవారు కూడా ప్రస్తుత ఎన్నికల కోసం తాజా నిబంధనలను పరిశీలించి, తమ పేరు జాబితాలో ఉందో లేదో నిర్ధారించుకోవాలి. ప్రజాస్వామ్యానికి పట్టభద్రులే దిక్సూచి అనేది గుర్తెర గాలి.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కేవలం అధికారాన్ని అందిపుచ్చుకునే మార్గాలు మాత్రమే కావు.. ప్రజల ఆలోచనలు, ఆ కాంక్షలు, అసంతృప్తులను ప్రతిబింబించే ప్రజాభిప్రాయ వేదికలు కూడా, ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మా రుతున్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గం రెండు సీట్లుగా కనిపించినా, దాపు రాష్ట్రంలో 70 శాతం ఓట్లు ఈ ఉమ్మడి జిల్లాల్లో ఉన్నా యి.
ఈ ఎన్నికల్లో పుంజుకుంటున్న బీసీ వాదం, విద్యావంతుల ఆలోచన, యువత భవిష్యత్తుపై ఆందోళన, ప్రభుత్వ పనితీరుపై అంచనా దాగి ఉంది. అందుకే ఈ ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలకు రాజకీయ సవాల్ గా మారింది. సామాజిక న్యాయం పాటించలేదనే అపవాదురాకుండా వచ్చే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు అట్టడుగు వర్గాలకే అంటూ ముందడుగు వేసింది.
నమ్మడానికి బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు సుముఖంగా ఉన్నది కాంగ్రెస్ అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యక్తమయ్యే అభిప్రాయానికి మధ్య తేడా ఉన్నప్పటికీ, ఈ ఫలితాలు రాజకీయ పార్టీలకు ఒక ము ఖ్యమైన సంకేతాన్ని అందిస్తాయి. పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటి? యువత ఏం కోరుకుంటోంది?
ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యావంతుల సమస్యలపై పార్టీల వైఖరిని ఎలా అంచనా వేస్తున్నారు? అనే ప్రశ్నలకు ఈ ఎన్నికలు కొంతవరకు అప్రమత్తం చేస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.
కేయూ జర్నలిజం విభాగాధిపతి, 9866255355