30వ రోజుకు చేరిన పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం
పాలిటెక్నిక్ విద్య పరిరక్షణకు ఐక్య పోరాటం
హనుమకొండ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ(Polytechnic education system)కు సంబంధించిన జిఓ 97 నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పాలిటెక్నిక్ వరంగల్‌లో కొనసాగుతున్న పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం(Movement to protect polytechnic education) నేటితో 30వ రోజుకు చేరుకుంది. పాలిటెక్నిక్ విద్య ప్రత్యేకత, విద్యా ప్రమాణాలు, విద్యార్థుల భవిష్యత్తు, బోధనా, బోధనేతర సిబ్బంది ప్రయోజనాలను పరిరక్షించాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతోంది. గత 30 రోజులుగా పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ కోసం వివిధ ప్రజాస్వామ్య, శాంతియుత నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తూ, జి.ఓ.97పై ప్రభుత్వం సమగ్రంగా పునఃపరిశీలన చేయాలని పాలిటెక్నిక్ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
పాలిటెక్నిక్ విద్యకు ఉన్న ప్రత్యేక లక్ష్యాలు, సాంకేతిక విద్యలో దాని ప్రాధాన్యత, విద్యార్థులకు అందించే నాణ్యమైన డిప్లొమా విద్య, బోధనా సిబ్బంది మరియు బోధనేతర ఉద్యోగుల సేవా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని వర్గాలతో సమగ్రంగా చర్చించిన తర్వాతే అమలు చేయాలని వారు కోరుతున్నారు. జి.ఓ.97 వల్ల రాష్ట్రంలోని ప్రస్తుత పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ, దాని అకడమిక్ నిర్మాణం, పరిపాలనా విధానం, సిబ్బంది సేవా అంశాలు, విద్యార్థుల విద్యా, ఉపాధి అవకాశాలు, అలాగే డిప్లొమా సాంకేతిక విద్య భవిష్యత్తుపై ప్రభావం ఉండే అవకాశం ఉందని పాలిటెక్నిక్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అందువల్ల సంబంధిత ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర భాగస్వాములతో సమగ్ర చర్చలు నిర్వహించి, పాలిటెక్నిక్ విద్య ప్రయోజనాలను కాపాడే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. పాలిటెక్నిక్ విద్య అనేది రాష్ట్రంలోని సాంకేతిక మానవ వనరుల అభివృద్ధిలో కీలకమైన భాగమని, దాని ప్రత్యేకత మరియు విద్యా ప్రమాణాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని నిర్వాహకులు తెలిపారు. జిఓ 97పై సమగ్ర చర్చ నిర్వహించి, పాలిటెక్నిక్ విద్య ప్రత్యేకతను, విద్యార్థుల భవిష్యత్తును మరియు సిబ్బంది ప్రయోజనాలను పరిరక్షించే విధంగా తగిన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ కోసం అవసరమైనంత కాలం శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.