మన దగ్గరే మంచి జీతాలు

11-09-2026 | 04:30am
  1. కనీస వేతనాల అమలులో తెలంగాణే రోల్ మోడల్
  2. మన రాష్ట్ర విధానాలపై ఐఎల్‌వో ప్రశంసలు
  3. కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
  4. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ ఏర్పాటుపై సానుకూలత
  5. శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కనీస వేతనాల విధానాన్ని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌వో) ప్రశంసించిందని శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) తెలిపారు. కనీస వేతనాల అమలులో ఇతర రాష్ట్రాలకు తెలంగాణే రోల్ మోడల్‌గా నిలిచిందని, ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాలని ఐఎల్‌వో సూచించిందన్నారు. అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు, సంస్థల్లో 1.10 కోట్లకు పైగా కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. వారి ఆర్థిక పరిస్థి తిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కనీస వేతనాలను సవరించి, జీవో 6 ద్వారా జూన్ 1 అమలు చేస్తున్నట్ల్లు చెప్పారు. ఎన్టీపీసీ, సింగరేణి తదితర సంస్థల్లో కనీస వేతనాలు అమలు కావడం లేదన్న అంశంపై విచారణ చేయిస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని ఇప్పటికే ఇంధన శాఖతో చర్చించామని, అవసర మైతే కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

గ్రామ పంచాయతీల్లో కనీస వేతనాల అమలుపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తామని చెప్పారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏ ర్పాటుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. త్వరలో సమావేశం నిర్వహిస్తామని, అహ్మద్ నదీమ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా తగు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుత సమస్య కోర్టు పరిధిలో ఉందని, దీంతో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు.


మరిన్ని వార్తలు