భారత్ నుంచి నేపాల్‌కు మరో బృందం
ఇది ఎనిమదో టీమ్ : కేంద్రం
ఢాకా, సెప్టెంబర్ 10: నేపాల్‌కు భారత్ ఆపన్నహస్తం అందిస్తూనే ఉంది. 35 టన్నుల సహాయక సామగ్రితోపాటు, 8వ సహాయక బృందం కాఠ్మాండుకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం (Central Government) గురువారం ప్రకటించింది. టెంట్లు, దుప్పట్లు, పరిశుభ్రతా కిట్లు, సోలార్ దీపాలు, మందులు, సహాయక పరికరాలను పంపినట్లు తెలిపింది. నేపాల్ వరదల్లో ఇప్పటివరకు 1,367 మృతదేహాలను వెలికితీశారు. 102 మృతదేహాలను గుర్తించారు.
5,400మందికిపైగా గల్లంతయినట్లు ప్రకటించారు. 6,827 మందికి గాయాలయ్యాయి. మరోవైపు 16వ రోజు కూడా విద్యుత్ ప్రాజెక్టు సొరంగాల్లో సహాయక బృందాలు రెస్క్యూ నిర్వహిస్తు న్నాయి. మరోవైపు మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్‌ఏ పరీక్షలు, ఆచూకీ గల్లంతైన వారి కోసం ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఈ వ్యవస్థల ద్వారా ఇప్పటివరకు 90 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు వివరించారు. భారత్ ఫోరెన్సిక్ నిపుణులతో సహా 54 మంది రెస్క్యూ బృందాలను నేపాల్‌కు పంపింది.