బీజేపీ మహిళా మోర్చా జిల్లా జనరల్ సెక్రెటరీగా రాథోడ్

14-10-2026 | 02:06pm

జుక్కల్, సెప్టెంబర్ 14 (విజయ క్రాంతి): భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) కామారెడ్డి జిల్లా మహిళా మోర్చా జిల్లా జనరల్ సెక్రెటరీగా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన రాథోడ్ సునీత నియమితులయ్యారు. బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు ఆదేశాల మేరకు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పావని రెడ్డి రాథోడ్ సునీతను జిల్లా జనరల్ సెక్రెటరీగా ప్రకటించారు.

పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మహిళా మోర్చాను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని రాథోడ్ సునీత తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు