టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలి

14-10-2026 | 03:41pm

రాజాపూర్ అక్టోబర్ 14:టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. రాబోయే ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని నాయకులందరూ అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి,మాజీ జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ నాయకులు అభిమన్యు రెడ్డి, రమేష్ నాయక్,మహిపాల్ రెడ్డి, నర్సింలు, బచ్చిరెడ్డి,ఆనంద్ గౌడ్, యాదగిరి నజీం బేగ్, శేఖర్ గౌడ్ , వెంకటాయ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు