కరెంట్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

16-10-2026 | 06:42pm

ములుగు, అక్టోబర్ 16 (విజయక్రాంతి): టీజీ ఎన్ పీడీసీఎల్ ఆధ్వర్యంలో ములుగు డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం(Mulugu Divisional Engineer's Office) వద్ద శుక్రవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. బిక్షపతి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ (ఆపరేషన్) కన్నరాజు, ఇతర అధికారులు, సిబ్బంది అందరూ పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సంబరంగా జరుపుకున్నారు.

మరిన్ని వార్తలు