ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం పాల్గొన్న ప్రభుత్వ విప్
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, అక్టోబర్ 16 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట మున్సిపాలిటీ(Yadagirigutta Municipality) పరిధిలోని 5వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు సునీతా దేవి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ(Housewarming for an 'Indiramma' house) వేడుకలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Govt Whip Beerla Ilaiah) పాల్గొన్నారు. లబ్ధిదారులకు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు పట్టుబట్టలు, 10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఐలయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేయలేని పనులను ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో(Congress government) ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తుందని అన్నారు.
సొంత ఇంటి కల నెరవేరి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న లబ్ధిదారుల కుటుంబంలో ఈ గృహప్రవేశ వేడుక ఆనందాన్ని నింపింది. ఈ కార్యక్రమం కుటుంబ సభ్యులు, స్థానికుల సమక్షంలో సంతోషకరమైన వాతావరణంలో జరిగింది.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ వైస్ చైర్మన్ బరిగే రమ్య రామ చందర్, కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.