100 కార్లతో కాంగ్రెస్ ‘సంవిధాన్ రక్షా ర్యాలీ’కి తరలిన శ్రేణులు

26-11-2026 | 03:41pm

వరంగల్ జిల్లా: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ (AICC) పిలుపు మేరకు టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షా ర్యాలీ’లో పాల్గొనేందుకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి.

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో సుమారు 100 కార్లతో నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు చేరుకుని రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్, సదానందం, రాజు, కిన్నెర రవి, తాజ్ముల్ ఖాన్, క్రాంతి, ఖామాల్, అనిల్, వేణు, పాషా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ (Constitution Protection), ప్రజాస్వామ్య విలువలు (Democratic Values) నినాదాలతో ర్యాలీ సాగింది.

మరిన్ని వార్తలు