జిల్లా గ్రంథాలయంలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ

26-11-2026 | 03:33pm

కొత్తగూడెం, నవంబర్ 26 (విజయక్రాంతి):  భారత రాజ్యాంగ దినోత్సవాన్ని (Constitution Day) పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కే. కరుణకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు, పాఠకులతో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా కార్యదర్శి కే. కరుణకుమారి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం (Indian Constitution) దేశ ప్రజలకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలను అందించిందని తెలిపారు. ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు ప్రాథమిక విధులు, బాధ్యతలను గుర్తించాలని సూచించారు. ప్రజాస్వామ్య (Democracy) విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రేడ్-2 గ్రంథపాలకురాలు ఎస్. లలితకుమారి, జి. మణిమృదుల, ఆఫీస్ ఇన్‌చార్జి నవీన్‌కుమార్, గ్రంథపాలకులు సీహెచ్. శ్రీనివాస్, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు, పాఠకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు