ఎస్పీని కలిసిన ట్రైనీ డీఎస్పీలు
కామారెడ్డి, నవంబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో 24 వారాల పాటు శిక్షణ పొందనున్న నలుగురు ట్రైనీ డీఎస్పీలు సోమవారం కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra)ను కలిశారు. ట్రైనీ డీఎస్పీలు ఎం. సూర్య ప్రకాష్ రెడ్డి, వి. అర్జున్ కుమార్, డి. సౌమ్య, ఎం. కవితలు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్రని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 24 వారాల పాటు కామారెడ్డి జిల్లాలో జిల్లా స్థాయి ప్రాక్టికల్ శిక్షణ ను శిక్షణ డిఎస్పీలు పొందనున్నారు.
శిక్షణలో భాగంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, పోలీస్ కార్యాలయాల పనితీరు, కానిస్టేబుల్ స్థాయి నుండి ఉన్నతాధికారుల వరకు నిర్వహించే విధులు, బాధ్యతలపై క్షేత్రస్థాయిలో అవగాహన పొందనున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం, న్యాయస్థానాల్లో జరిగే కార్యకలాపాలు, పరిపాలనా విధానాలను కూడా క్షుణ్ణంగా తెలుసుకోనున్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ పోలీస్ శాఖ విధులు, బాధ్యతలు, వృత్తి నైపుణ్యంలో సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. నర్సింహారెడ్డి పాల్గొన్నారు.