నాయకపోడ్ ఉప తెగకు ప్రత్యేక నెంబర్ కేటాయించాలి

06-10-2026 | 07:28pm

వెనుకబడిన తెగల జాబితాలో చేర్చాలి: ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్

భూపాలపల్లి టౌన్ (విజయక్రాంతి): నాయకపోడ్ తెగకు ప్రత్యేక నెంబర్ కేటాయించి వెనుకబడిన తెగల జాబితాలో చేర్చాలని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం మేకల రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District)లో ఐటిడిఏను ఏర్పాటు చేయాలని, నాన్ షెడ్యూల్ గ్రామాలను షెడ్యూల్ ఏరియా జాబితాలో చేర్చాలని అన్నారు. జిల్లాలో ఆదివాసులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికి ఇప్పటివరకు ఐటీడీఏ లేక అదివాసులు అభివృద్ధికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్నారని అన్నారు.

ఈ ప్రాంతంలోకి అనేక సంవత్సరాల క్రితం వచ్చిన ఆదివాసులకు ఎస్టీలుగా గుర్తించి సంక్షేమ పథకాలు అన్ని సౌకర్యాలు కల్పించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలం రాజేందర్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీను, పోలం రాజేందర్, శేఖర్, కాపుల విజయ్, కోడి రాము, కౌశిక్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు