చిన్నారులకు పోషకాహారం అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ఐడీఓసీలో ఘనంగా బతుకమ్మ, పోషణ మాసం వేడుకలు
భూపాలపల్లి, అక్టోబర్ 16 (విజయక్రాంతి): చిన్నారులకు పోషకాహారం(Nutritious food) అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(Bhupalapally MLA Gandra Satyanarayana Rao) అన్నారు. ఐడీఓసీ ఆవరణలో శుక్రవారం బతుకమ్మ వేడుకలతో(Bathukamma celebrations) పాటు 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమాన్ని(National Nutrition Month Program) ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించగా, మహిళా అధికారులు, ఉద్యోగులు బతుకమ్మ పాటలు, కోలాటాలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అనంతరం పోషణ మాసం కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని ఎమ్మెల్యే సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సొంత భవనాలు లేని కేంద్రాలకు భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఉత్తమ బతుకమ్మలకు జ్ఞాపికలు, పోషణ ఛాంపియన్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, యువజన క్రీడల శాఖ అధికారి రఘు, సంక్షేమ అధికారి మల్లీశ్వరి, డీఆర్డీఓ బాలకృష్ణ, సీపీఓ క్రిష్ణయ్య, ఎస్సీ అభివృద్ధి అధికారి సుకీర్తి జై భీం, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు, టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి షఫీ సర్కార్, జిల్లా అధ్యక్షులు బూరుగు రవి, కార్యదర్శి దసరథం, అధికారులు, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.