ఘనంగా నెహ్రూ జన్మదిన వేడుకలు
మహా ముత్తారం నవంబర్ 13 (విజయ క్రాంతి): పండిట్ జవహర్ లాల్ నెహ్రు(Pandit Jawaharlal Nehru) జన్మదిన వేడుకల సందర్బంగా మహాముత్తారం మండలం స్తంభం పల్లి (పి పి ) గ్రామంలోని ప్రాథమిక పాఠశాల లో(Primary school) ముందస్తు గా బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించరు నిర్వహించారు బాలలు ఉపాధ్యాయులుగా అవతారమెత్తి తరగతులను బోదించడం జరిగింది.
అనంతరం ఉత్తమంగ బోదించిన చిన్నారులకు బహుమతులను అందజేశారు స్థానిక సర్పంచ్ జంగిడి కీర్తన శ్రీనివాస్ విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు పెన్నులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంగిడి కీర్తన శ్రీనివాస్ ప్రధానోపాధ్యాయులు భూక్య రవినాయక్, ఉపాధ్యాయరాలు కుంభం పద్మ,పంచాయతీ కార్యదర్శి సమ్మరాజు, వార్డు మెంబర్స్ శ్రీకాంత్, సునీత రమేష్, రాహుల్ గ్రామస్తులు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు