శబరిమలై కి సరుకుల పంపిణీ

13-11-2026 | 05:51pm

భైంసా ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా  నుండి కేరళలోని శబరిమల సమీపంలోని నారాయణతోడ్ గ్రామంలో(Narayanthod Village) ఉచిత అన్నదానం(Free Food Distribution) నిర్వహించేందుకు తీసుకెళ్తున్న కిరాణా ముడి సరుకుల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అఖిలభారత అయ్యప్ప సేవా ట్రస్ట్ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో భక్తులు అందజేసిన కిరాణా సరుకులను అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం రెండు నెలల పాటు కొనసాగే అన్నదానానికి తమ వంతు సహాయంగా నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో పంపుతున్నట్లు తెలిపారు. అయ్యప్ప సన్నిధికి సమీపంలోని నారాయణతోడ్ గ్రామంలో ప్రతిరోజు ఈ అన్నదానం కొనసాగుతుందని పేర్కొన్నారు.

అయ్యప్ప స్వాములు ఈ ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు కనపర్తి విగ్నేష్, జాప ప్రకాష్, సాదం ఆనంద్, మందాజి మారుతి,జ్యోతిర్మయి, ముద్రకోలా శ్రీనివాస్,బద్రి శ్రీనివాస్,నాయకులు మేడారం ప్రదీప్, ఒడిస్సాల అర్జున్, మహేందర్,, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు