అఖిల భారత రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయండి

13-11-2026 | 05:52pm

దామరచర్ల :నవంబర్ 13 : ఈ నెల15 నుండి 18 వరకు నల్లగొండ పట్టణంలో ఎన్జీ కాలేజీ గ్రౌండ్ లో జరిగే అఖిల భారత రైతు సంఘం(All India Farmers' Union) మహాసభలకు పెద్ద ఎత్తున తరలి వచ్చి జయప్రదం చేయాలని రైతు సంఘం మండల అధ్యక్షులు మాలోతు వినోద్ నాయక్(Malothu Vinod Naik) కోరారు.దామరచర్ల లో శుక్రవారం ఆయన మాట్లాడారు. లక్ష మందితో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు కేంద్ర  రైతు సంఘం నాయకుల తోపాటు కామ్రేడ్ బృందా కారత్(Comrade Brinda Karat) హాజరవుతున్నట్లు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను తిప్పి కొట్టిన ఘనత మన రైతు సంఘానిదేనన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా ఉద్యమాల కిల్ల విప్లవాల పురిటి గడ్డ ఆనాడు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం(Telangana Peasant Armed Struggle) చేసి రైతులకు భూమి నుండి వెట్టిచాకిరి విముక్తి గావించిన గడ్డపై ఏఐకేఎస్ 36వ జాతీయ సభలు నిర్వహించడం దేశానికే గర్వకారణమని చెప్పారు.

ఇప్పుడు బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధివిధానాలపై ఆనాటి స్ఫూర్తిని తీసుకొని మళ్లీ అటువంటి ఉద్యమాల కార్యచరణ తీర్మానాలు చేసుకొని దేశవ్యాప్తంగా ఉద్యమాలకు ఊపిరిని ఇస్తామని అన్నారు. నల్లగొండ 15వ తారీఖు నాడు జరిగే భారీ బహిరంగ సభకు జిల్లాలోని రైతాంగ సోదర సోదరీమణులు , చిన్న కారు సన్న కారు రైతులు అందరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర నాయక్ , సిఐటియు నాయకులు దయానంద్ , ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వీరన్న తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు