విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు
రామచంద్రపురం నవంబర్ 13: భారతీనగర్ డివిజన్(Bharatinagar Division) పరిధిలోని ఫెన్సింగ్ ఏరియా కాలనీలో పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి , భారతీనగర్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పర్యటించారు.కాలనీలో ఇళ్లకు ఆనుకుని, నివాసితులకు ఇబ్బందికరంగా ఉన్న చిన్న విద్యుత్ స్తంభాలను పరిశీలించారు. ఈ సమస్య పరిష్కారానికి విద్యుత్ శాఖ ఎ.డి.ఇ నాగరాజు, ఎ.ఇ. తిరుపతమ్మ, కాంట్రాక్టర్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు.
చిన్న విద్యుత్ స్తంభాల స్థానంలో పెద్ద విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్,నరసింహ, జైపాల్, కొండల్, జాకీర్, శివ తదితరులు పాల్గొన్నారు.