ప్రభుత్వ భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు అరికట్టాలి
తహసీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకుల వినతి
గణపురం, నవంబర్ 13 (విజయ క్రాంతి): గణపురం మండల పరిధిలో పట్టా, లావణి, సీలింగ్, ప్రభుత్వ భూముల్లో(Government lands) ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు(Illegal soil excavation) చేపట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ దేవేందర్‌కు వినతిపత్రం అందజేశారు.
భూపాలపల్లి పట్టణానికి చెందిన కొందరు మట్టి దళారులు జేసీబీలతో అర్ధరాత్రి వేళల్లో తవ్వకాలు చేపట్టి లారీలు, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ భూములను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అక్రమ తవ్వకాలను అరికట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి, లట్ట రాజబాబు, మాజీ జెడ్పీటీసీ, బీఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు బుర్ర మనోజ్ గౌడ్, గాజర్ల చింటూ గౌడ్, మామిండ్ల సాంబయ్య యాదవ్, మండల పార్టీ కార్యదర్శి ఎండీ వాజిద్, రత్నం నవీన్ తదితరులు పాల్గొన్నారు.