అవగాహన లేని సమావేశం ఎందుకు?
ఆరుతడి పంటలపై ఏర్పాటు చేసిన సమావేశంలో రైతుల నిలదీత
నిజాంసాగర్ నవంబర్ 13( విజయక్రాంతి): అధికారులకి అవగాహన లేకుండా సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారని రైతులు(Farmers) మండల స్థాయి అధికారులను నిలదీసిన సంఘటన. కామారెడ్డి జిల్లా(Kamareddy District) నిజాంసాగర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎల్ నీనో(El Nino), ఆరుతడి పంటలపై(Wet crops) మండల ప్రత్యేక అధికారి కుటుంబరావు అధ్యక్షతన రైతులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు.
నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ(Irrigation Department, Electricity Department) ఉన్నత అధికారులు, రాకుండా సమావేశం ఏమిటని నిజాంసాగర్ ఆ యకట్టు పరిధిలోని పంటలకు ఎన్ని విడుతల నీరు అందిస్తారని రైతులు నిలదీశారు. రైతులకు వ్యవసాయానికి ఎన్ని గంటల కరెంటు అందిస్తారనేది విద్యుత్ శాఖ అధికారులు స్పష్టంగా తెలుపకపోవడంతో రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకే సరియైన అవగాహన లేకుండా సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారని పూర్తి సమాచారంతో రైతులకు సమాచారం అందిస్తే లాభసాటిగా ఉంటుందని వారు పేర్కొన్నారు.
అధికారులు సమన్వయం చేసుకొని నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా ఆరుతడి పంటలకు ఎన్ని విడుదల నీరు అందిస్తారో, విద్యుత్ శాఖ అధికారులు ఎన్ని గంటల విద్యుత్ సరఫరా ఇస్తారో స్పష్టంగా తెలిపి రైతుల నష్టపోకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శివ కృష్ణ, తాసిల్దార్ సాయి భుజంగరావు, వ్యవసాయ అధికారి ఆచరిత, అచ్చంపేట సహకార సంఘ అధ్యక్షులు పట్లోళ్ల జనార్దన్ రెడ్డి, సర్పంచులు, నాయకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.