బిర్సా ముండా జయంతి వేడుకలు జయప్రదం చేయాలి

13-11-2026 | 05:44pm

కలెక్టర్ కె.హరిత 

ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో ఈ నెల 15న ఆదివారం నిర్వహించనున్న భగవాన్ బిర్సా ముండా(Bhagwan Birsa Munda) 151వ జయంతి, జన జాతీయ గౌరవ దివస్ వేడుకలను(Jan Jatiyo Gaurav Divas Celebration) విజయవంతం చేయాలని కలెక్టర్ కె.హరిత(Collector K. Haritha) కోరారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ..ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ ప్రాంగణంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను భావితరాలకు తెలియజేయడంతో పాటు గిరిజన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడమే కార్యక్రమ ఉద్దేశమన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నాయకులు, గిరిజన పెద్దలు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు