భూపాలపల్లి ఏరియాలో కంపెనీ స్థాయి పోటీలు

14-10-2026 | 04:51pm
  1. పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్ 
  2. 15, 16 తేదీల్లో లాన్ టెన్నిస్, బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహణ

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 14 ( విజయక్రాంతి ) : సింగరేణి సంస్థ(Singareni Company) ఆధ్వర్యంలో కంపెనీ స్థాయి లాన్ టెన్నిస్, బాస్కెట్‌బాల్ టోర్నమెంటును ఈనెల 15, 16 తేదీల్లో భూపాలపల్లి ఏరియాలో నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ క్రీడా పోటీలను ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభిస్తారని తెలిపారు.

సింగరేణి ఉద్యోగుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించడం, ఉద్యోగుల మధ్య స్నేహభావం, ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ టోర్నమెంటుకు కంపెనీకి చెందిన వివిధ ఏరియాల క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు.

మరిన్ని వార్తలు