ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి
డి.ఎస్.పి సూర్యనారాయణ..
పలిమెల అక్టోబర్ 6 (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందిస్తూ ప్రజలతో సమన్వయంతో విధులు నిర్వహించాలని కాటారం డిఎస్పి సూర్యనారాయణ(DSP Suryanarayana) అన్నారు. మంగళవారం నాడు పలిమెల పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీలో భాగంగా ఆయన సందర్శించారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనం పరిశుభ్రతను పెంపొందించేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు అనంతరం పోలీస్ స్టేషన్లోని వివిధ రికార్డులను రిజిస్టర్లను కేసుల దర్యాప్తు పురోగతిపై ఆరా తీశారు.
పెండింగ్ కేసులను పరిశీలించారు. పోలీసు సిబ్బంది కిట్ బాక్సులు విధి నిర్వహణ సామాగ్రిని తనిఖీ చేసి వాటి ఎల్లప్పుడూ సక్రమంగా సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పెండింగ్ కేసు దర్యాప్తులో వేగవంతం చేసి నిబంధనల ప్రకారం తరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణ అసాంఘిక కార్యకలాపాల నివారణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్టేషన్ విధి నిర్వహణలో క్రమశిక్షణ అప్రమత్తత బాధ్యతాయుతమైన వైఖరి పాటించాలని పోలీసు సిబ్బందికి డి.ఎస్.పి సూర్యనారాయణ సూచించారు. ఆయన వెంట మహాదేవపూర్ సి ఐ వెంకటేశ్వర్లు,పలిమేల ఎస్సై సాయి శశాంక్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.