బిస్మిల్లా బీ కుటుంబాన్ని పరామర్శించిన గండ్ర
11-09-2026 | 01:11pm
మాజీ ఎమ్మెల్యే గండ్ర పరామర్శ
గణపురం, సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు హఫీజ్ నాయనమ్మ బిస్మిల్లా బీ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట ఆయా గ్రామాల బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.