ధర్మరావుపేటలో ఉచిత పశువైద్య శిబిరం
గణపురం,నవంబర్ 06 (విజయక్రాంతి): గణపురం మండలం(Ganapuram Mandal) ధర్మరావుపేటలో పశుసంవర్ధక శాఖ(Department of Animal Husbandry) ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం(Free Treatment Camp for Uterine Diseases) నిర్వహించారు. సర్పంచ్ పూజారి రాజేందర్ గౌడ్ శిబిరాన్ని ప్రారంభించారు. పశువైద్యాధికారి సూరం బాలకృష్ణ పశువుల్లో గర్భకోశ వ్యాధుల నివారణపై రైతులకు(Farmers') అవగాహన కల్పించారు.
శిబిరంలో 24 ఎదకు రాని పశువులు, 26 దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేయగా, 16 పశువులకు చూడు పరీక్షలు నిర్వహించారు. వీబీజీ రామ్జీ పథకంలో భాగంగా పచ్చిగడ్డి సాగుకు ఎకరానికి రూ.14,300, పశువుల షెడ్ల నిర్మాణానికి సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గండు శ్రీనివాస్, సూపర్వైజర్ ఆయిలు మల్లు గోపాల మిత్రలు రాజేంద్ర చారి చక్రపాణి, దామోదర్, ఎల్ ఎస్ ఏ శ్రీధర్ పాడి రైతులు పాల్గొన్నారు.