కార్తీక దీపోత్సవానికి నూనె క్యాన్ల వితరణ

09-11-2026 | 08:48pm

గణపురం,నవంబర్ 09 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం(A Center of Art under the Kakatiyas) శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం(Ganapeswara Temple with Bhavani) కోటగుళ్లలో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఈనెల 24న నిర్వహించే దీపోత్సవానికి గణపురం మండల కేంద్రానికి చెందిన దూలం సంజన, తిరుపతి గౌడ్ , వడ్లకొండ చేరాలు గౌడ్, విజయలక్ష్మి, కీర్తి, శ్రీకాంత్ గౌడ్ దంపతులు నూనె క్యాన్ లను ఆలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయానికి నూనెను అందజేసిన దంపతులకు కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

మరిన్ని వార్తలు