తెలంగాణలో జనగణనకు డేట్ ఫిక్స్

09-11-2026 | 04:46pm

జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!

హైదరాబాద్: తెలంగాణలో 2027 జనగణన(Census 2027)కు సంబంధించి కీలక షెడ్యూల్ ఖరారైంది. కేంద్ర ప్రభుత్వ గెజిట్ మార్గదర్శకాల(Central Government Gazette guidelines)కు అనుగుణంగా రాష్ట్రంలో జనాభా లెక్కింపు నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28, 2027 వరకు ఇంటింటికీ వెళ్లి జనాభా వివరాలు సేకరించనున్నారు.

ప్రజలకు ముందుగానే తమ వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. జనవరి 10 నుంచి 24 వరకు స్వీయ గణన (Self Enumeration)కు అవకాశం ఉంటుంది. అనంతరం మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ రౌండ్ నిర్వహించి సేకరించిన వివరాలను మరోసారి పరిశీలించనున్నారు.

దాదాపు 16 ఏళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ జనగణన ద్వారా దేశ జనాభాకు సంబంధించిన తాజా గణాంకాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ పథకాల రూపకల్పన, అభివృద్ధి ప్రణాళికలు, వనరుల కేటాయింపులో ఈ గణాంకాలు కీలకంగా మారనున్నాయి. ప్రజలు జనగణన ప్రక్రియలో భాగస్వాములై సరైన వివరాలు అందించాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు