మందమర్రిలో కంపెనీ స్థాయి క్రికెట్ పోటీలు

09-11-2026 | 08:34pm

మందమర్రి, (విజయక్రాంతి ): సింగరేణి సంస్థ(Singareni Company) ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి సంబంధించి కంపెనీ స్థాయి క్రికెట్ పోటీలు(Company-level cricket tournaments) ఈ నెల 11, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ తెలిపారు. సోమ వారం ఇన్‌చార్జ్ డీజీఎం (పర్సనల్) సురేందర్ తో కలిసి మాట్లాడారు. మంచిర్యాల జిల్లా(Mancherial District) మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌లోని ఠాగూర్ స్టేడియం, మందమర్రిలోని సింగరేణి హైస్కూల్(Singareni High School) మైదానంలో పోటీలు జరగనున్నాయనీ, ఈ పోటీల్లో సింగరేణి సంస్థలోని అన్ని ఏరియాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నారనీ తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు