పార్క్, వాల్కింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ నిర్మించాలని వినతి

09-11-2026 | 08:46pm

ఘట్ కేసర్, నవంబర్ 9 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్(Ghatkesar Circle, Pocharam Division) పరిధిలోని ప్రతాపసింగారంలో పార్క్, వాల్కింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్(Park, walking track, open gym) నిర్మించాలని కోరుతూ సోమవారం పోచారం డివిజన్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ బద్దం కుమార్ ఆధ్వర్యంలో సర్కిల్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రతాప సింగారం ప్రభుత్వ పాఠశాల(Pratapa Singaram Government School) వెనకాల సుమారు రెండువేల గజాల ఖాళీ స్థలం ఉన్నదని తెలిపారు ఈ ప్రాంతంలో రోజురోజుకు జనాభా పెరుగుతుందని, కావున ఆ స్థలంలో పార్కు, వాల్కింగ్, ట్రాక్, ఓపెన్ జిమ్ నిర్మించినట్లయితే మహిళలు, వృద్ధులు, విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దయచేసి నిర్మిస్తారని అధికారులకు అందజేసిన వినతిపత్రంలో కోరారు.

మరిన్ని వార్తలు