ఘనంగా సదర్ ఉత్సవాలు

09-11-2026 | 08:45pm

కౌకుంట్ల: మండల కేంద్రంలో ఆదివారం శ్రీ గోపాలకృష్ణ యాదవ సంఘం(Sri Gopalakrishna Yadav Sangam) వారి ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు(Sadar Utsavalu) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దున్నపోతులను అందంగా అలంకరించి, కౌకుంట్ల ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. ముందుగా దున్నపోతులతో విన్యాసాలు చేయించారు. ఈ ఉత్సవాలకు యాదవులు అధిక సంఖ్యలో పాల్గొని, ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు.

ఈ సదర్ ఉత్సవాలు యాదవుల సంస్కృతి(Culture of Yadavas) సంప్రదాయాలకు అద్దం పడతాయని, వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ పశుసంపద కూడా సమానంగా అభివృద్ధి చెందాలనే సందేశాన్ని ఈ పండుగ అందిస్తుందని వారు పేర్కొన్నారు. మనసులను ఎంతగా గౌరవిస్తామో, పశు సంపదను కూడా అంతే ప్రేమతో, గౌరవంతో చూసుకోవడం మన గ్రామీణ సంస్కృతిలో భాగమని వారు వివరించారు.

దున్నపోతులను అందంగా అలంకరించి, పూజించి గౌరవించడం సదర్ పండుగ ప్రత్యేకత అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ యాదవ కమిటీ అధ్యక్షులు పడమటి గోవిందు, కార్యదర్శి కావాలి శేఖర్, డైరెక్టర్లు మెట్ల ఆంజనేయులు, కనుమనూరు రామచంద్రి, యల్మే రాములు, బురెడ్డి నారాజు, సంఘం రవి యాదవ సొంగని రవి,సదర్ ఉత్సవ సభ్యులు, కౌకుంట్ల సర్పంచ్ నరేష్ కుమార్, ఉప సర్పంచ్ లక్ష్మీకాంతరావు, వార్డ్ మెంబర్ రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు