ఆటోను ఢీకొన్న బైక్.. బోల్తాపడిన ఆటో

25-11-2026 | 04:52pm

ధ్వంసమైన ద్విచక్రవాహనం.. తృటిలో తప్పిన ప్రమాదం

ముదిగొండ, నవంబర్ 25 (విజయక్రాంతి): ముదిగొండ మండలం(Mudigonda Mandal) మాదాపురం–వెంకటాపురం గ్రామాల మధ్య ఆటో, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైకు బలంగా ఢీకొనడంతో అదుపుతప్పిన ఆటో రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాద తీవ్రతకు బైకు తీవ్రంగా దెబ్బతిని విడిభాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. బైకు హెల్మెట్ సైతం రోడ్డు పక్కన పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ బైకుపై ఉన్న వ్యక్తికి, ఆటో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. వాహనాలు దెబ్బతిన్నప్పటికీ ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు