విద్యార్థులకు కుర్చీలు విరాళం

13-11-2026 | 05:37pm

తాడ్వాయి,నవంబర్,13( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలోని(Errapahad Village) ప్రాథమిక పాఠశాల(Primary school) నర్సరీ విద్యార్థులకు గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులు కుర్చీలు విరాళంగా అందించారు. గ్రామంలోని నర్సరీ విద్యార్థులకు శుక్రవారం 20 కుర్చీలు విరాళంగా అందించినట్లు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఏనుగు మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు స్వరూపారాణి,ప్రధాన కార్యదర్శి గైని రాజలింగం,నాయకులు రాజిరెడ్డి,ముఖేష్ గౌడ్,మ్యాకం హనుమండ్లు, పంచాయతీ కార్యదర్శి నవీన్ రావు,కారోబార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు