మహదేవ్‌పూర్‌లో ఇందిరమ్మకి నివాళి
మహదేవ్పూర్, నవంబర్ 19 (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో భారత తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ (Indira Gandhi) జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కట్కం అశోక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దేశ సమగ్రత (National Unity), పేదల సంక్షేమం, మహిళా సాధికారత (Women Empowerment) కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ సేవలు మరువలేనివని, కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాపు, మహదేవ్పూర్ సర్పంచ్ హసీనా బాన్, మాజీ ఎంపీపీ రాణిబాయ్, మాజీ ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ వామనరావు, కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ గుడల శ్రీనివాస్, అంబట్పల్లి మాజీ సర్పంచ్ విలాస్ రావు, దేవస్థానం డైరెక్టర్ దొడ్ల అశోక్, కుంభం పద్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామకృష్ణ, ఇర్షాద్, బేగ్లూరు సర్పంచ్ ఆకుల రాజయ్య, మహిళా మండల అధ్యక్షురాలు బందేల సత్తక్క, ఎస్సీ సెల్ అధ్యక్షుడు లేతకారి రాజబాపు, మైనార్టీ నాయకులు అశ్రార్ ఖురేషి, ఎజాజ్, కోట సమ్మయ్య, బుర్రి శివరాజ్, తిరుపతి రెడ్డి, వరప్రసాద్, దాగం సంతోష్, జగదీష్, రాఘవేంద్ర, కూరతోట సుధాకర్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.