యాసంగి లో వరి వేయవద్దు

14-10-2026 | 03:38pm

సదాశివనగర్,అక్టోబర్ 14(విజయక్రాంతి):మండలంలోని వజ్జేపల్లి తండా గ్రామంలో  పంటలను బుధవారం మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి(Agricultural Officer Prajapati) పరిశీలించారు.వరి మరియు పత్తి పంటలో చీడపీడల నివారణ గురుంచి రైతులకు తెలియజేశారు.అలాగే  ఎల్ నినో ఎఫెక్ట్ వలన యాసంగిలో వరి పంట వేయరాదని సూచించారు.

వరికి బదులు ఆరతడి పంటలైనటువంటి జొన్న, శనగ, కుసుమ,  పెసర, మినుము, సజ్జలు,మధ్యస్థంగా నీరు కలిగిన వారు  ప్రొద్దుతిరుగుడు, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు అలాగే పుష్కలమైన నీటి వసతి మరియు మార్కెట్ కలిగిన రైతులు కూరగాయలు పండించుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు