జైల్ భరోను జయప్రదం చేయండి: మొహమ్మద్ మౌలానా

25-11-2026 | 04:56pm

ఈనెల 30న కలెక్టరేట్ ఎదుట ధర్నా: అజ్మీరా రామ్మూర్తి నాయక్

2027 సీపీఐ సభ్యత చేర్పింపు, పునరుద్ధరణ

కూసుమంచి, నవంబర్ 25(విజయక్రాంతి): మోడీ విధానాలను నిరసిస్తూ సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా డిసెంబర్ 1, 2, 3వ తేదీలలో ఖమ్మం జిల్లాలో నిర్వహించబోయే.. జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా(Mohammed Maulana) పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

బుధవారం కూసుమంచి మండల పరిధిలోని, గైగోళ్ళపల్లి గ్రామంలో పార్టీ మండల కార్యదర్శి భూక్య నరసింహ అధ్యక్షతన జరిగిన జరిగిన మండల కౌన్సిల్ సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. 1 వ తేదీన ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట, 2 వ తేదీన కల్లూరు డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం ఎదుట, 3 వ తేదీన ఖమ్మం ఆర్డిఓ కార్యాలయం ఎదుట.. కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, మోడీ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటాలకు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు నాయకులు సంసిద్ధం కావాలని అన్నారు. మోడీ సంపన్నులు, కార్పోరేటర్ల కోసమే పాలనా కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

డిసెంబర్ 27 నుండి 29 వరకు ఖమ్మం నగరంలో జరగబోయే మహిళా సమాఖ్య రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సూచించారు. 27న జరగబోయే మహా ప్రదర్శనలో యువతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు అజ్మీరా రామ్మూర్తి నాయక్ మాట్లాడుతూ... ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన కరవు పరిస్థితిని నిరసిస్తూ.. ఈనెల 30వ తేదీన కలెక్టరేట్ ఎదుట జరగబోయే ధర్నాకు జిల్లాలోని గిరిజన తాండాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

అనంతరం 2027 సంవత్సరానికి సంబంధించిన పార్టీ సభ్యత్వ, పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా పార్టీ సభ్యత్వాన్ని పార్టీ కార్యకర్తలు, నాయకులు తెలంగాణ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహమ్మద్ మౌలానాకు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు కత్రోజు పాండురంగాచారి, సీపీఐ జిల్లా సమితి సభ్యులు గుండెపంగు మల్లేష్, జిల్లా లింగయ్య, తెలంగాణ గిరిజన సమైక్య మండల అధ్యక్షులు వీరన్న, గైగోళ్ళపల్లి గ్రామశాఖ  కార్యదర్శి తేలు పిచ్చయ్య, సంధ్యా తాండ గ్రామశాఖ కార్యదర్శి భూక్య మంగ్య, నాయకులు భూక్యా పీక్ల, కొరట్ల సత్యం, జిల్లా రామచంద్రు, జిల్లా మైసయ్య, కోరట్ల శ్రీను, అల్లి ఏలాద్రి, జిల్లా మల్సూరు, భూక్య చిరంజీవి, భూక్యా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు