బీమా నమోదును తనిఖీ చేసిన కలెక్టర్
25-11-2026 | 04:54pm
భైంసా నవంబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా(District Collector Bhavesh Misra) సూచించారు. బుధవారం బాసర మండలంలోని సావర్గం గ్రామంలో బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించే భూముల రీ సర్వే పరిశీలించిన కలెక్టర్ సర్వే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు