ఏకగ్రీవంగా ఎంఎస్ఎఫ్ మండల కమిటీ
విద్యార్థి దశ నుండే అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపు
భూపాలపల్లి టౌన్, నవంబర్ 13 ( విజయక్రాంతి ) : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ(Padma Shri Mandakrishna Madiga) ఆదేశాల మేరకు ఎంఎస్ఎఫ్ భూపాలపల్లి మండల కమిటీని(MSF Bhupalpally Mandal Committee) శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నిక ఎంఆర్పీఎస్ కో ఇంచార్జి దోర్నాల రాజేందర్ ఆధ్వర్యంలో, ఎంఎస్ఎఫ్ జిల్లా ఇంచార్జి మడిపల్లి సుమన్ అధ్యక్షతన జరుగగా ఎంఎస్పీ, ఎంఆర్పీఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంచార్జి మడిపెల్లి శ్యాంబాబు, ఏక్ శంకర్, ఎంఎస్పీ జిల్లా కో ఇంచార్జి, రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసమానతలు లేని సమాజం నిర్మాణం కోసం విద్యార్థి దశ నుండే కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంఎస్ఎఫ్ భూపాలపల్లి మండల కమిటీని ఎన్నుకున్నారు.
మండల అధ్యక్షులు నెరుపటి ఆదర్శ, అధికార ప్రతినిధిగా మామిడి రంజిత్, ఉపాధ్యక్షులుగా కాసిపేట జోసెఫ్, మడికొండ సూర్య వర్మ, ప్రధాన కార్యదర్శి మెరుపటి అజయ్, సహాయ కార్యదర్శి దాసరపు కిరణ్, కోశాధికారి చిర్ర కార్తీక్ ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు నోముల శ్రీనివాస్, అంతడుపుల సురేష్, మెరపటి అశోక్, మామిడి రవి, మొలుగూరి రవీందర్, ఓనపాకల కుమార్, అంబాల కవిశ్వర్, బట్టు విజయ, కళ్ళపెళ్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.