ప్రవేశాల గడువు పొడగింపు
నిర్మల్ నవంబర్ 13 ( విజయక్రాంతి): తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(Telangana Open School Society) ద్వారా 2026–27 విద్యా సంవత్సరానికి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి దర్శనం భోజన్న శుక్రవారం తెలిపారు. చదువును మధ్యలో నిలిపివేసిన వారు, వివిధ కారణాలతో సాధారణ విద్యకు దూరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆసక్తి గల విద్యార్థులు తెలంగాణ ఓపెన్ స్కూల్ అధికారిక వెబ్‌సైట్ www.telanganaopenschool.org ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రవేశ గడువు పొడిగింపును అర్హులైన విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.