ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

13-11-2026 | 04:28pm

తాడ్వాయి,నవంబర్,13( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం సోమారం గ్రామంలో  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్ మోహన్ రావు(Yellareddy MLA K. Madan Mohan Rao) చిత్రపటానికి శుక్రవారం ప్రతినిధులు పాలాభిషేకం నిర్వహించారు. సోమారం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు(Mandal Parishad Upper Primary School) ఎమ్మెల్యే రూ. 27.10 లక్షలు నాబార్డు నిధుల(NABARD funds) నుంచి మంజూరు చేసినందుకు ఆయనకు గ్రామ పెద్దలు ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ... ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అదనపు తరగతి గదుల నిర్మాణానికి, విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించడం కోసం నాబార్డు నిధుల నుంచి నిధులు మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలనే సంకల్పంతో ఎమ్మెల్యే పనిచేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు,  గ్రామ సర్పంచ్ బల్లాన వినోద రాములు, సింగిల్ విండో చైర్మన్ లు సంతాజిగారి సుధాకర్ రావు, ఏనుగు వెంకట్ రెడ్డి, సదాశివ నగర్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు జక్కుల రాజిరెడ్డి,నాయకులు వెంకట్ రెడ్డి,పైడి రాజేశ్వర్ రెడ్డి,అంబీర్ శ్యామ్ రావు,మేకల రాజు, శ్రీకాంత్, ప్రసాద్ రావు,అశోక్ రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు