ఖేలో ఇండియా ఫుట్‌బాల్ కోచింగ్ క్యాంప్‌కు ఆర్తి ఎంపిక

13-11-2026 | 04:25pm

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఖేలో ఇండియా అండర్‌(Khelo India Under)-18 బాలికల ఫుట్‌బాల్ కోచింగ్ క్యాంప్‌కు(Girls' Football Coaching Camp) ఆసిఫాబాద్ గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్షియల్(Tribal Welfare Residential School for Girls) ఫుట్‌బాల్ అకాడమీలో పదో తరగతి చదువుతున్న చౌహాన్ ఆర్తి(Chauhan Aarti) ఎంపికైంది. నవంబర్ 13 నుంచి 25 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో శిక్షణ శిబిరం జరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్తి ఎంపికపై డీసీఓ అరుణశ్రీ, డీవైఎస్‌ఓ అష్ఫాక్ అహ్మద్, ప్రధానోపాధ్యాయురాలు మహేశ్వరి, కోచ్ రవి తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.

మరిన్ని వార్తలు