ఈనెల 18న వ్యాపార దుకాణాలకు వేలంపాట

13-11-2026 | 04:29pm

నిర్మల్, నవంబర్ 13 ( విజయ క్రాంతి): జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం(Service Cooperative Development Society) ఎస్సీ కార్పొరేషన్ వ్యాపార దుకాణ సముదాయానికి ఈనెల 18న వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ తెలిపారు. పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం వద్ద ఉన్న ఎస్సీ కార్పొరేషన్ ఒకటో నెంబర్ వ్యాపార దుకాణానికి వేలంపాట నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఈ వ్యాపార దుకాణాన్ని ఎస్సీలకు కేటాయించడం జరుగుతుందని వ్యాపార దుకాణాన్ని పొందేందుకు 1000 రూపాయల డిడి చెల్లించి ఈనెల 17 లోపు శాఖ కార్యాలయంలో అందించాలన్నారు. కుల ఆదాయ రేషన్ కార్డ్ నివాసం జిరాక్స్లతో పాటు 50 వేల ఈఎండి చెల్లించి వేలంపాటలో దుకాణాన్ని దక్కించుకోవచ్చని తెలిపారు. వేలంపాటలో దుకాణం పొందిన వారికి వ్యాపార దుకాణాన్ని అద్దె రూపంలో ఇవ్వడం జరుగుతుందని ఇతర వివరాలకు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు. ఫోన్ 8317642844 నంబర్లు సంప్రదించాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు