దళిత మోర్చా నిర్మల్ పట్టణ అధ్యక్షుడిగా కత్తి సుధాకర్

13-11-2026 | 04:39pm

ఖానాపూర్ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా(Bharatiya Janata Party Dalit Morcha) నిర్మల్ పట్టణ అధ్యక్షుడిగా బుధవార్‌పేట్ కాలనీకి చెందిన కత్తి సుధాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయన నియామకాన్ని ప్రకటించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డిని సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.

తనపై నమ్మకంతో దళిత మోర్చా పట్టణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతోపాటు పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జుట్టు దినేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు