కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

13-11-2026 | 04:34pm
  1. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 
  2. మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ 

గణపురం,నవంబర్ 13 (విజయ క్రాంతి): రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలను(Grain purchasing centers) రైతులు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని గణపురం సొసైటీ అప్పయ్యపల్లి, సీతారాంపూర్, కొండాపూర్, జంగుపల్లి, ధర్మ రావు పేట పరశురాంపల్లి,  గాంధీనగర్, లక్ష్మారెడ్డి పల్లి, గ్రామాల్లో  కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్య మిక్రయించాలని ‌ ప్రభుత్వం అందించే బోనస్ అందుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం అనంతరం గణపురం మండల కేంద్రంలో 23 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అడ్లూరి రాజేశ్వరరావు ఎంపీడీవో ఎల్ భాస్కర్ గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు