మసీదును, ఏడు గుళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తాం
డిసిసి అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్
మేడ్చల్ అర్బన్ నవంబర్ 13(విజయక్రాంతి): మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్(Medchal Municipal Corporation) పట్టణంలోని ఏడుగుళ్ల మందిరాన్ని, పక్కనే ఉన్నటువంటి జిందా షామధార్ దర్గా మసీదును(Zinda Shah Madar Dargah Mosque) కాపాడే ప్రయత్నం చేస్తానని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్(Thotakura Vajresh Yadav) హామి ఇచ్చారు. శుక్రవారం మసీదులో(Mosque) ప్రార్థన అనంతరం ముస్లింలు(Muslim) నల్ల బ్లాడ్జిలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ జాతీయ రహదారి నిర్మాణంలో(Construction of the Medchal National Highway) భాగంగా జిందా షామధార్ దర్గా మసీదును, ఏడు గుళ్ళ అమ్మవారి ఆలయాన్ని తొలగించడానికి జాతీయ రహదారుల వారు ఇచ్చిన నోటీసులను తాము కూడా అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
పట్టణంలోని మసీదుతో పాటు అమ్మవారి ఆలయ కమిటీలతో చర్చలు జరిపి ఒక స్పష్టత వచ్చేంత వరకు అమ్మవారి ఆలయాన్ని కాని మసీదును కాని ముట్టనివ్వమని ఆయన మరోసారి హామి ఇచ్చారు. ఒకవేళ జాతీయ రహదారుల చట్టం ప్రకారం ప్రజాహితం కోసం తొలగించాల్సి వస్తె రెండు మతాల ప్రార్థన మందిరాల కోసం ప్రత్యామ్యాంగా వేరే చోట నిర్మించి ఇచ్చేలా తన వంతు కృషి చేస్తానని వజ్రేష్ యాదవ్ తెలియజేశారు.
మేడ్చల్ మున్సిపల్ పట్టణంలోని మసీదు, ఏడు గుళ్ళ అమ్మవారి ఆలయాలను కూల్చే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.అదేవిధంగా ఆలయ,మసీదు కమిటీల వారు చింతించాల్సిన అవసరం లేదని ఈ విషయంలో తప్పక ఇరువర్గాల ఆమోదం పొందిన తర్వాతే జాతీయ రహదారుల అధికారులు పనులు చేపడతారని వజ్రేష్ యాదవ్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రామన్నగారి రాఘవేందర్ గౌడ్.చాపరాజు ముదిరాజ్. వేముల శ్రీనివాస్ రెడ్డి.యూసఫ్ ఖాన్.ఎండి అలీ తదితరులు పాల్గొన్నారు.