రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు న్యాయ నిర్ణేతగా ఎంపికైన శ్రీనివాస్
తాడ్వాయి,నవంబర్,13( విజయక్రాంతి ): రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు(State level kabaddi competitions) న్యాయ నిర్ణేతగా కామారెడ్డి పట్టణంలోని(Kamareddy town) శ్రీ సరస్వతి విద్యా మందిర్ హై స్కూల్(Sri Saraswati Vidya Mandir High School) వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాస్(Physical Education Teacher Srinivas) ఎంపికైనట్లు కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజన్న తెలిపారు. ఈనెల 12 నుంచి 14 వరకు వికారాబాద్ జిల్లాలో జరగనున్న సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు శ్రీనివాస్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానాచార్యులు నాగభూషణం ఆచార్య, అకాడమిక్ ప్రిన్సిపల్ నగేష్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.