చేనేత కార్మికులకు జియో ట్యాగ్ నిబంధన ఎత్తివేయాలి
పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్
భూపాలపల్లి టౌన్, నవంబర్ 20 ( విజయక్రాంతి ) : చేనేత కార్మికుల పెన్షన్(Pension for Handloom Weavers) విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) పద్మశాలి సంఘం అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ క్యాతం సతీష్ కుమార్(Jayashankar Bhupalpally district Padmashali Sangham president Kyatham Satish Kumar) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ తరతరాలుగా చేనేత వృత్తినే నమ్ముకుని, జీవితాంతం మగ్గంపై శ్రమిస్తున్న కార్మికులకు జియో ట్యాగింగ్ నిబంధనతో సంబంధం లేకుండా 50 ఏళ్లు దాటిన వయసును, వారి వృత్తి సేవలను ప్రామాణికంగా తీసుకుని పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గీత కార్మికులకు(Geeta workers) అమలు చేస్తున్న తరహాలోనే పద్మశాలి చేనేత కార్మికులకు పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికులకు(Handloom workers) పెన్షన్ విషయంలో న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడి సంఘం తరుపున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.