ఆడబిడ్డల ఆత్మగౌరవం బతుకమ్మ
ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
గంభీరావుపేట, అక్టోబర్ 14 (విజయక్రాంతి ): గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలో ఐసీడీఎస్ అంగన్వాడీ సెక్టార్(ICDS Anganwadi Sector) ఆధ్వర్యంలో సూపర్వైజర్ కళావతి నేతృత్వంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లతిక, మాజీ జెడ్పీటీసీ కొమ్మిరి శెట్టి విజయ ముఖ్య అతిథులుగా హాజరై అంగన్వాడీ సిబ్బందితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఇలాంటి వేడుకలు మహిళల్లో ఐక్యతను పెంపొందించడంతో పాటు సంప్రదాయాలను భావితరాలకు అందిస్తాయని పేర్కొన్నారు. వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.